Friday, February 10, 2012

Yuvraj Singh posts 'hair gone' picture on Twitter





Yuvraj Singh has posted a picture on Twitter that shows him without hair. Yuvraj, who is undergoing chemotherapy in Boston, for a rare germ cell cancer, tweeted to say, "finally the hair has gone! But #livstrong #yuvstrong". The left hander had tweeted a couple of days back to say that he was recovering well, and couldn't wait to be back in his India colours.

Thursday, December 15, 2011

Yuva Samrat Naga Chaitanya’s Tamil Movie Details


Yuva Samrat Naga Chaitanya’s Tamil Movie Details



Yuva Samrat Naga Chaitanya is all set to make his Tamil Debut soon with the Radha Mohan flick ‘Gouravam’. The movie is going to be produced by Annapurna Studios and it will be a bilingual film. Reports say that Nagarjuna would be playing a guest role in the movie.

Thaman is said to be the music director. Chaitanya is currently busy with ‘Autonagar Surya’, which is being filmed under the direction of Deva Katta. Nagarjuna expressed happiness about the script of Autonagar Surya and said that the movie would be a nice entertainer.

Interestingly, when questioned about the recent disappointments of Bejawada and Dhada, Nagarjuna was very candid about them and he said that they would be a nice learning experience for Chaitanya. He also expressed his unhappiness about the directors of those films.

Thursday, November 17, 2011

హాలీవుడ్ పై కన్నెసిన





బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్, హాలీవుడ్ పై కన్నేసింది. సరైన ఛాన్స్ వస్తే సత్తా చతుకుంటాను అంటూ ఈ మద్యనే ఓ ఇంటర్వ్యూ లో తన ఆసక్తి ప్రదర్శించింది కత్రిన కైఫ్.

Friday, November 4, 2011

చైనా వెళ్లనున్న రామ్ చరణ్ రచ్చ




రామ్ చరణ్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో పారస్ జైన్, ఎన్వీప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున చిత్రం రచ్చ త్వరలో ఈ చిత్ర బృందం చైనా కి వెళ్లనుంది.

ఈ చిత్రంలో వచ్చే కొన్ని పోరాట సన్నీవేషాలని చిత్రికరించడానికి ఈ చిత్ర బృందం చైనా కి వెళ్లనుంది. చైనా లోనీ అటవీ ప్రాంతంలో ఈ సన్నివేశాలని చిత్రీకరిస్తారని సమాచారం.

ఈ చిత్రం లో రామ్ చరణ్ ని ఒక కొత్త కోణంలో చూస్తారు ఇందులో చరణ్ నృత్యాల మీద ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నారు, ఈ చిత్రానికి మణిశర్మ హుషారైన సంగీతం సమాకుర్చారు, ఇందులో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలని గోవా, శ్రీలంకలో చిత్రీకరించామని చిత్రవర్గాల సమాచారం.

రామ్ చరణ్ , తమన్నా, సంగీతం:మణిశర్మ కెమెరా: సమర్పణ: ఆర్.బి.చౌదరి, నిర్మాతలు:పారస్ జైన, ఎన్వీప్రసాద్, దర్శకత్వం: సంపత్ నంది.


ఈ రోజు విడుదల కానున్న గోపిచంద్ మొగుడు




లక్ష్మినరసింహ ప్రొడక్షన్స్ పతాకం పై కృష్ణవంశీ దర్శకత్వంలో నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న 'మొగుడు' చిత్రం ఈ రోజు విడుదల కానుంది. గోపిచంద్, తాప్ప్సి జంటగా నటిస్తున ఈ చిత్రం లో రాజేంద్రప్రసాద్ గోపిచెంద్ కి తండ్రీ గా నటిస్తున్నాడు. ఇంకా ఈ చిత్రంలో తాప్ప్సి తల్లి పాత్రని రోజా చేస్తున్నారు.

ఈ సినిమాలో గోపిచెంద్ పాత్ర పేరు రాంప్రసాద్,ఇంట్లో అందరు ముద్దుగా బుజ్జి అని పిలుచుకుంటారు. రాజేంద్రప్రసాద్ ఆంజనేయప్రసాద్ గా ఈ చిత్రంలో కనిపిస్తారు. ఆంజనేయప్రసాద్ కి సంప్రదాయాల మీద అనుబందల, ఆప్యాయతల మీద నమ్మకం ఎక్కువ. మంచి సాంప్రదాయమైన కుటుంబం నుండి కోడల్ని తేచ్చుకోవలనుకుంటాడు . ఈ క్రమం లో అఖిలాండేశ్వరి(రోజా) కూతురు తాప్ప్సి తో పెళ్లి జరుగుతుంది. తరువాత ఎం జరిగింది అనేది సినిమాలో చూడాలి. ఇందులో శ్రద్ధాదాస్ ఒక ముఖ్య పాత్రాని పోషిస్తునారు.

గోపిచెంద్, తాప్ప్సి , రాజేంద్రప్రసాద్, రోజా, నరేష్ , శ్రద్ధాదాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: బాబుశంకర్, కెమెరా: శ్రీకాంత్, నిర్మాత: నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి), దర్శకత్వం: కృష్ణవంశీ.

Thursday, November 3, 2011

జూనియర్ ఎన్టీఆర్ దమ్ములో హీరోయిన్ త్రిష మూడు గెటప్పులు





ఎన్టీఆర్ దమ్ము లో మూడు గెట్ అప్ లలో కనిపించనున్న త్రిష. జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవి దమ్ము శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బోయపాటి శ్రీను సింహా తరువాత చేస్తున్న సినిమా కాబట్టి నందమూరి ఫ్యాన్స్ లో సినిమా పై చాలా అంచనాలే పెట్టుకున్నారు. అంచనాలకు తగినట్టుగా బోయపాటి సినిమాను డిఫరెంట్ గా తీర్చి దిద్దుతున్నారు. ఈ సినిమాలో పాత్రలన్నింటికీ జాగ్రత్తగా నటుల ఎంపిక చేశారు. భానుప్రియ ఎన్టీఆర్ తల్లిగా నటిస్తుండగా, బావగా వేణు నటిస్తున్నాడు. హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. నటులను విభిన్నంగా ప్లాన్ చేసిన బోయపాటి, వారి పాత్రలను కూడా కొత్తగా తీర్చి దిద్దుతున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ త్రిష మూడు గెట్ అప్ లలో కనిపించనుందట. అలాగే ఎన్టీఆర్ కూడా ఎక్కువ గెట్ అప్స్ లోనే కనిపిస్తాడట. ఎన్టీఆర్ తో మొదటి సారి జత కడుతుండటంతో త్రిష కూడా సినిమా పై ఆసక్తి గా ఉందని తెలుస్తుంది. వచ్చే సంవత్సరం పరీక్షల సీజన్ పూర్తయ్యేనాటికి దమ్మును రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

సాధించాలంటే సాహసించాల్సిందే




‘సాహసం చేయరా డింభకా రాజకుమారి దక్కుతుంది...’ అంటూ అలనాడు ‘పాతాళభైరవి’ సినిమాలో యస్వీ రంగారావు, రామారావును ప్రేరేపించటం మనకు గుర్తుంది. సాహసంతోనే అసాధ్యాలను సుసాధ్యాలుగా మలచుకొని, తాను వలచిన రాజకుమారిని పెళ్లాడాడు సాధారణ తోటరాముడు. అది సినిమా కావొచ్చు. కల్పన కావొచ్చు. కాని.. సాహసాలు చేసి ఎందరో కొత్త ఆవిష్కరణలకు, అద్భుతాలకు తెర తీశారనటం వాస్తవం.
సాంకేతికపరమైన అంశాలు అందుబాటులో లేని కాలంలో సముద్ర మార్గం ద్వారా ఐరోపా ఖండం చుట్టి.. భారతదేశం చేరుకున్న పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా సాహస యాత్ర.. చరిత్రను ఎన్ని మలుపులు తిప్పిందో మనందరికీ తెలుసు. ఆనాడు ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో నావికులు చేసిన సాహస యాత్రల మూలంగా ఎన్నో చీకటి ఖండాలు వెలుగులోకి వచ్చాయి.
సాహసించకపోతే.. టెన్సింగ్ నార్కే మహోన్నత హిమగిరి ఎవరెస్ట్‌ను అధిరోహించి ఉండేవాడా? యూరీ గగారిన్ అంతరిక్ష యాత్ర చేసి ఉండేవాడా? నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలు మోపగలిగేవాడా?.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో సాహసవంతమైన విజయాలు మనకు కనిపిస్తాయి.
అయితే.. ప్రతి సాహసం వెనుక విజయం ఉండకపోవచ్చు. జయాపజయాలు సాధారణం. సాహసించే ప్రతివారూ విజయం కోసమే తపిస్తారు. విజయ లక్ష్యంగానే సాహసానికి పూనుకుంటారు. ఒక్కోసారి దురదృష్టం వెంటాడి.. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి.
కొన్ని రకాల సాహసాలలో పాల్గొనే వారికి.. అదెంత ప్రమాదకరమైనదో తెలుసు. అదుపు తప్పితే జరిగే పరిణామాలేమిటో తెలుసు. అయినా వారు ఆ సాహసం పట్ల ఆసక్తిని కనపరుస్తారు. అంతేకాదు దానిని వారు ఓ ఛాలెంజ్‌గా తీసుకుంటారు. విజయం తమదేననే భరోసాతోనే ముందుకు సాగుతారు. అపజయాన్ని, ప్రమాదాన్ని ఎవరూ ముందుగా ఆశించరు. తమకన్నా ముందు అలాంటి సాహసకృత్యాలలో ప్రమాదానికి గురై, తీవ్ర గాయాలైన లేదా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసినా.. అదే సాహసకృత్యానికి పూనుకునేవారూ ఉన్నారు. అంతరిక్ష నౌక పేలిపోయినంత మాత్రాన అమెరికా అంతరిక్ష ప్రయోగాలు ఆగిపోయాయా..? మరింత సాంకేతిక జాగ్రత్తలు పెంచుకుంటూ ముందుకు సాగటం లేదా? కల్పనా చావ్లా దుర్మరణం చూసి భయపడి వుంటే.. సునీతా విలియమ్స్ సక్సెస్ సాధించి ఉండేదా? మరి కొంతమంది వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యేవారా? అందుకే సాహసికులు జరిగిన సంఘటనలకు భీతి చెందరు. అలా భీతి చెందేవారు అసలు అలాంటి సాహసానికి సిద్ధపడరు.
సాహసమే నా ఊపిరి.. విజయమే నా లక్ష్యం అనే సిద్ధాంతం వారిది. అయితే చాలామంది అనుకోవచ్చు - ప్రాణాంతకమైన సాహసకృత్యాలు అవసరమా అని? మరి అవే లేకపోతే.. మానవ జాతి ఇంత ప్రగతి సాధించేదా? అందుకే ప్రతి విజయం వెనుక ఓ సాహసం, ఓ ఉత్సాహం, ఓ ప్రేరణ తప్పనిసరి. అయితే ప్రతి సాహసం పాజిటివ్ దృక్పథం కలిగినదై ఉండాలి.
అయితే సాహసాలకు పూనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
తాము పూనుకోబోతున్న సాహసం వెనుక ఎలాంటి ప్రమాదాలు ఉండగలవో ముందుగా ఒక అవగాహనకు రావాలి. గతంలో ఏ లోపాల వల్ల ప్రమాదాలు జరిగాయో పరిశీలించాలి. వాటిని లోతుగా విశే్లషించుకోవాలి. దానికి తగిన విధంగా వ్యూహాలను ఆలోచించాలి. ముందస్తు ప్రణాళికను సమగ్రంగా రూపొందించుకోవాలి.
అనుకోకుండా సంభవించే ప్రమాదాలను ఎదుర్కోగలిగే ఆత్మస్థైర్యాన్ని గుండెల నిండా నింపుకోవాలి. చాలినంత టెక్నాలజీని అందుబాటులో ఉంచుకోవాలి. అది అపాయకర వేళ సహకరించేలా చూసుకోవాలి. స్వతహాగా ప్రమాద సమయంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం మంచిది. సాహసకృత్యాల సమయంలో భయాందోళనలకు గురి కాకూడదు.
ఒక్కో సమయానికి అవే ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. సాధించాలనే స్థిరత్వం, తపనలే చాలావరకు విజయం వైపు నడిపించగలవు.
కాబట్టి సాహసం చేయటం తప్పు కాదు. సాహసాలే విజయానికి సోపానాలు. అయితే తగు జాగ్రత్తలు తప్పనిసరి. చక్కటి ప్రణాళికతో, వ్యూహాత్మక నిర్ణయాలతో.. ముందుకు సాగితే.. మంచి ఫలితాలను సమాజానికి అందించవచ్చు. భావితరాలకు మార్గదర్శకులుగా నిలువవచ్చు.
-కె.ఆదిశేషారెడ్డి ( from ANDHRABHOOMI)